బూస్టర్‌ డోస్‌ తీసుకున్న కమలా హ్యారిస్

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. అర్హులైన వారందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. మోడెర్నా వ్యాక్సిన్ మూడో డోస్‌ను వైట్‌హౌస్‌లో ఆమె తీసుకున్నారు. ‘ప్రారంభం నుంచి ఇదే మాట చెప్తున్నాం. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే ఉచితం కూడా’ అని ఆమె చెప్పారు.

మోడెర్నా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అమెరికా ఫుడ్ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు పైబడిన వారందరూ బూస్టర్ తీసుకోవాలని ఈ సంస్థ చెప్పింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/