ట్రంప్‌పై కమలా హారిస్‌ విమర్శలు

kamala-harris

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై క‌మ‌లా హారిస్ విమర్శలు గుప్పించారు. అమెరికా డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని క‌మ‌లా హారిస్ బుధ‌వారం అంగీక‌రించింది. ఈ నేప‌థ్యంలో ఆమె క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మ‌న విషాదాల‌ను ట్రంప్ రాజ‌కీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. రాబోయే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జోసెఫ్ బైడెన్‌కు ఓటు వేయాల‌ని ఆమె అమెరిక‌న్ల‌ను కోరారు. బైడెన్ దేశాధ్య‌క్షుడు అయితే.. దేశ ప్ర‌జ‌లంద‌రినీ ఆయ‌న ఒక్క‌టి చేస్తార‌న్నారు. ట్రంప్ నాయ‌క‌త్వ వైఫ‌ల్యం.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, జీవితాల‌ను ప్ర‌మాదంలో నెట్టేసింద‌న్నారు. న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/