కమలహాసన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం

ఒడిశా: ప్రముఖ సినీనటుడు కమలహాసన్ కు ఒడిశాలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా కమల్ ఈ రోజు ఈ డాక్టరేట్ అందుకున్నారు. బాల్యంలోనే నట జీవితాన్ని ప్రారంభించిన కమలహాసన్ ఇటీవల సినీ జీవితంలో 60 వసంతాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తన నటనకు గానూ ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. కమల్ విశిష్ట నటుడిగా మాత్రమే కాకుండా.. మంచి కథకుడిగా, స్కీన్ర్ ప్లే రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగానూ రాణించారు. 1980, 90ల్లో వచ్చిన కమల్ సినిమాలు ఆయనలోని అసాధారణ నటనను బయటపెట్టాయి. ఇప్పటికీ ఆయన విభిన్న పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. గతంలో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కూడా కమల్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/