లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ పోటీ చేయ‌డం లేదు

kamal haasan
kamal haasan

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రకటించారు. పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ఆయన ఆదివారం ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పోటీ చేసే వారంతా తన ప్రతిరూపాలేనని, రథంలో ఉండడం కంటే రథాన్ని లాగే వ్యక్తిగా ఉండడానికే తాను నిర్ణయించుకున్నానని అభిప్రాయపడ్డారు. సమాన వేతనం, మహిళలకు రిజర్వేషన్లు, అందరికీ ఉద్యోగాలు లాంటి పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, ఫ్రీ వైఫై, రహదారులపై టోల్‌ రుసుముల రద్దు లాంటి పలు అంశాలపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.