కమల్‌కు మద్దతుగా రజని!

kamal haasan, rajani kanth
kamal haasan, rajani kanth


చెన్నై: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతుంది. ఐతే తాజాగా కమల్‌ పార్టీకి రజనీకాంత్‌ మద్దతు పలికినట్లు కమలే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. గతంలో ఒకసారి రజనీని కలిసినపుడు కమల్‌ మద్దతు కోరినట్లు అందుకు రజనీ సరేనన్నారని కమల్‌ తెలిపారు. దీంతో రేపటి రోజు తమదే నన్న విశ్వాసాన్ని రజనికాంత్‌ వ్యక్తం చేశారని కమల్‌ చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాని కమల్‌ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాని పార్టీ మాత్రం 39 లోక్‌సభ స్థానాల్లో, 18 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచింది.
కమల్‌ పార్టీ మాత్రం తృణమూల్‌తో కలిసి పనిచేస్తుంది. గత నెల 25న కోల్‌కత్తా పర్యటనలో భాగంగా సియం మమతాతో భేటి ఐన కమల్‌ ఈ విషయమై చర్చించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో టిఎంసి తరఫున ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ ఆరున జరిగే ప్రచారంలో పాల్గొంటానన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/