కల్యాణ్‌రామ్ ‘అమిగోస్‌’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

బింబిసార మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ..ప్రస్తుతం నవీన్‌ మేడారం దర్శకత్వంలో డెవిల్‌ : ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు దానికి సంబదించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులను సంతోష పెట్టాడు.

‘అమిగోస్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లోకల్యాణ్ రామ్‌ పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్‌ లుక్‌తో తెలియజేశాడు డైరెక్టర్ రాజేంద్రరెడ్డి. బింబిసారలో డ్యుయల్‌ రోల్‌లో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయబోతున్నాడని టాక్‌.. కాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రాజేంద్రరెడ్డి. గిబ్రాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.