కళ్యాణం కమనీయం నుండి ‘ఓహో ఎగిరే’ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ – ప్రియా భవాని శంకర్ జంటగా అరుణ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కళ్యాణం కమనీయం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నుండి తాజాగా ‘ఓహో ఎగిరే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘కాటుక కన్నే కన్నే .. మీటను నన్నే నన్నే’ అంటూ సాగిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన ఈ పాట శ్రోతలను బాగా అలరిస్తుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.

విభిన్నమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శోభన్ నుంచి ఇటీవల వచ్చిన ‘మంచిరోజులొచ్చాయి’ .. ‘ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ సినిమా ఎలా ఉండవు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సంతోష్ మాత్రం ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని ధీమా గా ఉన్నాడు.

YouTube video