కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీచేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను అంద‌జేశారు. వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు రూ. 1, 45,16, 820 కళ్యాణ లక్ష్మి, షాదిముబార‌క్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. ఇవాళ కేసీఆర్ పేదింటి యువ‌తుల‌కు మేన‌మామ‌లా మారార‌ని కొనియాడారు. పేదింటి అమ్మాయిల‌కు పెండ్లి కోసం రూ. 1,00,116ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: