అమిగోస్ సెన్సార్ రిపోర్ట్

బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ..ఇప్పుడు అమిగోస్ మూవీ తో ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో హీరో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు , టీజర్, బాలయ్య నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రీమిక్స్ సాంగ్ , ట్రైలర్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచాయి. నిన్న ప్రీ రిలీజ్ వేడుక కు ఎన్టీఆర్ రావడం తో సినిమా ఫై ఇంకాస్త ఆసక్తి పెరిగింది.

ఇక ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను చిత్ర బృందం పూర్తి చేసింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా చాల బాగా వచ్చిందని., మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడని , మిగతా నటి నటులు కూడా బాగానే చేసారని , దర్శకుడు రాజేంద్ర చాల బాగా సినిమాను తెరకెక్కించారని చెప్పడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.