హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించిన కళ్యాణ్ జ్యువెలర్స్

హైదరాబాద్‌లో తమ 5వ షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది..

Kalyan Jewellery has opened a brand new showroom at Charminar, Hyderabad

హైదరాబాద్‌: భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ మరియు ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఈరోజు హైదరాబాద్‌లోని చార్మినార్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క వివిధ కలెక్షన్ ల నుండి విస్తృతమైన డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆభరణాల ప్రేమికులకు సాటిలేని కొనుగోలు అనుభవాన్ని అందించే ఈ షో రూమ్ లో ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలను ఆశించవచ్చు. ఈ సరికొత్త షోరూమ్ హైదరాబాద్‌లో కంపెనీకి ఐదవ అవుట్‌లెట్ కాగా తెలంగాణలో ఎనిమిది. ఈ ప్రాంతంలో తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరించడం, కస్టమర్‌లకు సులభంగా బ్రాండ్‌ను అందుబాటులో కి తీసుకురావాలనే కంపెనీ వ్యూహంలో ఈ షో రూమ్ ప్రారంభం ఒక భాగం.

ఈ నూతన షో రూమ్ ప్రారంభోత్సవం పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అన్ని ఆభరణాల ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 14, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. అదనంగా, కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ ధర ను సైతం అందిస్తున్నది. ఇది మార్కెట్‌లో అత్యల్పమైనది మరియు భారతదేశం అంతటా ప్రామాణికమైనది – వర్తింప జేస్తుంది.

ఈ కొత్త షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద మా సరికొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా, మా కస్టమర్‌లకు సంపూర్ణ కొనుగోలు వాతావరణం సృష్టించడం మరియు విభిన్న ఆభరణాల అవసరాలను తీర్చడం, మరియు వారి షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యం. సంస్థ యొక్క విశ్వాసం మరియు పారదర్శకత యొక్క విలువలకు కట్టుబడి, వినియోగదారులకు ప్రపంచ స్థాయి వాతావరణాన్ని అందిస్తూ, మమ్మల్ని మేము పునరావిష్కరించుకోవడం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము…’ అని అన్నారు.

స్వచ్ఛత, ఆభరణాల యొక్క ఉచిత జీవితకాల నిర్వహణ, వివరణాత్మక ఉత్పత్తి సమాచారం మరియు పారదర్శక మార్పిడి, తిరిగి కొనుగోలు విధానాలకు హామీ ఇచ్చే కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క 4-అంచెల హామీ సర్టిఫికేట్‌ను కూడా కొనుగోలు దారులు అందుకుంటారు. ఈ సర్టిఫికెట్ తమ విశ్వసనీయ కస్టమర్లకు అత్యుత్తమమైన వాటిని అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ముహూర్తం (వెడ్డింగ్ జువెలరీ లైన్), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమా (టెంపుల్ జ్యువెలరీ), గ్లో (డ్యాన్సింగ్ డైమండ్స్), జియా (సాలిటైర్ తరహా డైమండ్ జ్యువెలరీ), అనోఖి (అన్‌కట్ డైమండ్స్), అపూర్వ (ప్రత్యేక సందర్భాల కోసం వజ్రాలు), అంతర (వివాహ వజ్రాలు), హేరా (డెయిలీ వేర్ డైమండ్స్), రంగ్ (విలువైన రాళ్ల ఆభరణాలు), మరియు ఇటీవల విడుదల చేసిన లీల (రంగు రాళ్లు మరియు వజ్రాల ఆభరణాలు). వంటి ప్రముఖ హౌస్ బ్రాండ్‌లను కూడా షోరూమ్ అందుబాటులో ఉంచుతుంది.