కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరీక్ష ఫలితాలు విడుదల

Kaloji health university
Kaloji health university

వరంగల్: కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలను నిర్వహించారు. ఆ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ ఇవాళ విడుదల చేసింది. ఇందులో 313 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌లో పాస్ అయినట్టు యూనివర్సిటీ తెలిపింది. ఫస్ట్ క్లాస్‌లో 1654 మంది, సెకండ్ క్లాస్‌లో 1241 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మార్కుల మెమోలను సంబంధిత కాలేజీకి పంపిస్తామని, విద్యార్థులు కాలేజీలో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.