చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారు – మంత్రి కాకాణి

ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మారుమోగిపోతుంది. సొంత పార్టీనే తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తూ పార్టీ రాజీనామా చేయడమే కాదు పార్టీ పలు ఆరోపణలు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఒక్క కోటంరెడ్డి నే చాలామంది త్వరలో వైస్సార్సీపీ నుండి బయటకు వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటె కోటంరెడ్డి ఫై వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు పలు విమర్శలు చేయగా..తాజాగా కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ లో 2014లో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కోటంరెడ్డికి జగన్ సీటును కేటాయించారని చెప్పారు. పార్టీ మారాలనుకోవడం ఆయన ఇష్టమని… అయితే వైస్సార్సీపీ ఫై బురద చల్లడం మంచిది కాదని అన్నారు. కోటంరెడ్డిని చంద్రబాబు ట్రాప్ చేశారని ఆరోపించారు. నిజంగా ట్రాపింగ్ జరిగినట్టయితే… అవమానం, అనుమానం అనే మాటలు మాట్లాడకుండా విచారణ ముందుకు వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆడియో రికార్డింగ్ అని తెలుసు కాబట్టే కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కాకాణి ఎద్దేవా చేశారు.