మాల్దీవుల్లో హనీమూన్

కాజల్, కిచ్లుల హనీమూన్ పిక్స్ వైరల్

మాల్దీవుల్లో హనీమూన్
kajal kitchlu-Honeymoon in the Maldives

టాలీవుడ్ ‘చందమామ’ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా గెస్ట్ లు తక్కువ మంది ఉన్నా కూడా లాంచనంగా వీరి వివాహం జరిగింది.

ముంబయిలో అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన వీరి పెళ్లి వేడుక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

పెళ్లికి ముందు నుండి పెళ్లి తర్వాత గృహ ప్రవేశం పూజా ఆ తర్వాత వారిద్దరి ఫొటో షూట్ ఇలా అన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు కాజల్ కిచ్లుల హనీమూన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రోనా మహమ్మారి కారణంగా ఎక్కువ దూరం వెళ్లకుండా మాల్దీవుల్లోనే హనీమూన్ ను ఈ కొత్త జంట ప్లాన్ చేసుకుంది.

రెండు రోజుల క్రితం బ్యాగ్స్ సర్దేశాం అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ దంపతులు హనీ మూన్ కు వెళ్లబోతున్నారు అంటూ అంతా భావించారు.

అన్నట్లుగానే వారు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటిలాగే షేర్ చేస్తున్నారు.

అందమైన కాజల్ రెడ్ డ్రస్ లో క్యాప్ పెట్టుకుని బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని వావ్ అన్నట్లుగా ఉంది. వారం రోజుల తర్వాత ఈ కొత్త దంపతులు ఇండియా తిరిగి రానున్నారు.

వచ్చిన వెంటనే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో కాజల్ పాల్గొనబోతుంది. 

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/