ఎంతూ కట్లెట్ అంటూ ముద్దు పేరు పెట్టా

Kajal ,Ballamkonda sai
Kajal ,Ballamkonda sai

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ‘అల్లుడు శీను’ అనే చిత్రంతో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నుండి కూడా తనకు తాను సొంతంగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చేస్తున్న ప్రతి సినిమా కోసం కూడా చాలా కష్టపడుతూనే ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ‘కవచం’ చిత్రాన్ని చేశాడు. కెరీర్ లో మొదటి సారి ఈ చిత్రంలో బెల్లంకొండ బాబు పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు కాజల్ మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. కవచం సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్బంగా హీరో బెల్లంకొండకు తాను ముద్దు పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఆయన భావిస్తూ ఉంటాడు. అందుకే నేను శ్రీనుకు ఎంతూ కట్లెట్ అంటూ ముద్దు పేరు పెట్టాను. ఎంతూ  కట్లెట్ అంటే ప్రతి విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసేవాడు అని అర్థం. తెలియని విషయం వదిలేయకుండా తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో నేను శీను ఒకటేనని కాజల్ చెప్పుకొచ్చింది.