పెళ్లి చేసుకునేంత తీరిక లేదు

Kajal Agarwal
Kajal Agarwal

కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం కవచం డిసెంబర్ 7న విడుదలకానున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు 

ఈ చిత్రం ఒప్పుకోవడానికి గల కారణం ?

ఇది ఒక కమర్షియల్ సినిమా ఈ చిత్రం అగీకరించడానికి చాలా కారణాలు వున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ చిత్రానికి నా పాత్ర కీలకం అయ్యేలా ఉండడం మెయిన్ రీజన్.

బెల్లకొండ సాయి శ్రీనివాస్ గురించి ?

సాయి చాల మంచి వ్యక్తి ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు తన తండ్రి పేరు ను ఉపయోగించుకొని ఎదిగాలనే ఉద్దేశం తో కాకుండా స్వతహాగా పైకి రావాలనే తపన వున్నవ్యక్తి .

క్వీన్ రీమేక్ గురించి చెప్పండి ?

నేను క్వీన్ తమిళ రిమేక్ లో నటిస్తున్నాను. పూర్తిగా లోకల్ లో సాగే సినిమా ఇది. ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈచిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలవుతుంది.

తేజ దర్శకత్వంలో మళ్ళీ నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?

ఆ చిత్రం కోసం చాలా ఆసక్తిగా పనిచేస్తున్నాను. నా కెరీర్ లోనే ఒక అద్భుతమైన రోల్ తేజ గారు నాకు ఆ సినిమా ద్వారా ఇచ్చారు. సవాలు తో కూడుకున్న పాత్ర అది. ఖచ్చితంగా ఆ చిత్రం నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుతుంది.

మీ పెళ్లి గురించి ?

నవ్వుతూ. ఇటీవల దీపికా మరియు ప్రియాంక పెళ్లిళ్లు చేసుకున్నారు. నాకు కూడా చేసుకోవాలనే వుంది కానీ ప్రస్తుతం నా కెరీర్ పిక్స్ స్టేజి లో వుంది . ఇలాంటి సమయం లో దాని గురించి ఆలోచించడం లేదు.

భారతీయుడు 2 గురించి ?

శంకర్ – కమల్ హాసన్ చిత్రంలో నటించే అవకాశం రావడం ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతానికైతే ఈ చిత్రం గురించి ఏమి చెప్పలేను. తర్వలోనే నా పాత్ర వివరాలను రివీల్ చేస్తాను….