ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు దెబ్బ

rabada
rabada

ఈసారైనా ఐపీఎల్ టైటిల్‌ కొట్టాలని పట్టుదలతో కనిపిస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్‌ రబాడా మిగిలిన మ్యాచ్‌ల నుంచి దూరం కానున్నాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రబాడా డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోయింది. ప్రపంచకప్‌ దగ్గరపడుతుండటంతో గాయం తీవ్రమవుతుందనే ఆలోచనతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు రబాడాను స్వదేశానికి రావాలని ఆదేశించింది.