కాచిగూడ ఘటనపై విచారణ షురూ

kacheguda railway accident
kacheguda railway accident

హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌-హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన కాచిగూడలో జరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణను ప్రారంభించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌కృపాల్‌ అధ్యక్షతన ఈ విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ప్రమాద సమయంలో పరిసర ప్రాంతాలవారిని, ప్రత్యక్ష సాక్షులు, స్థానికులని కమిటీ విచారిస్తోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ విచారరణ జరగుతుంది. అనంతరం ఘటనా స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌ రైల్‌ భవన్‌లో రైల్వే ఉద్యోగులను ఈ తప్పిదం మానవతప్పిదమా? లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనే విషయాలను విచారణలో తెసుకోనున్నారు. విచారణ అనంతరం ఘటనకు భాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా ఈ విచారణలో కాచిగూడ స్టేషన్‌ మేనేజర్‌, డివిజన్‌ రీజనల్‌ మేనేజర్‌ మరియు అధికారులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/