మునుగోడు ఉప ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలుస్తా – కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నానని , సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మునుగోడు ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన..తన ప్రచారాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని , 26 మంది అభ్యర్థులు తనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో తాను 30 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. కేసీఆర్ మాటలు నమ్మొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. మాట తప్పారన్నారు. తాను అధికారంలోకి వస్తే ఒక్కో మండలానికి ఒక్కో కాలేజ్, హాస్పిటల్ కడుతానని కేఏ పాల్ అన్నారు.

ఇదిలా ఉంటె మునుగోడు ప్రచారంలో పాల్ ..చెప్పులు కుట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు. నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఓ చెప్పులు కుట్టే వ్యక్తిని పలకరించారు పాల్. వెంటనే అతని పక్కన కూర్చొని చెప్పులు కుట్టారు. దేశాధినేతలు, ప్రపంచ అధిపతుల పక్కన కూర్చొని విమానాల్లో ప్రయాణించిన కేఏ పాల్ ఇలా చెప్పులు కుట్టడం ఏంటి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.