పవన్ కళ్యాణ్ ఫై కేపాల్ కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నో పార్టీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ నాశనమైపోయిందని, వెంటనే పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరాలని పాల్ అన్నారు. రీసెంట్ గా కేపాల్ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు లో పర్యటించి తనదైన ప్రచారంతో ఆకట్టుకున్నారు. కానీ జనాల చేత ఓటు మాత్రం వేయించుకోలేకపోయారు. కేవలం మూడు వందల ఫై చిలుకు ఓట్లతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత బిజెపి , టిఆర్ఎస్ పార్టీల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇదిలా ఉంటె తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ, సిపిఐ, బహుజన సమాజ్వాది పార్టీ అలాగే బిజెపి ఇంకా ఎన్నో పార్టీలో పవన్ కళ్యాణ్ చేరడంతో ఆయన ఓట్ బ్యాంక్ నాశనమైపోయిందని ఆరోపించారు. 2008 నుంచి పార్టీ పెట్టారే… కానీ సొంత సీటులో గెలవలేదని ఏద్దేవా చేశారు. ఆయన పార్టీని లీడ్ చేయడమేంటి ? పవన్ కళ్యాణ్ కు అమిత్ షా అపాయింట్మెంట్ అసలు లేనేలేదని చురకలంటించారు. వెంటనే పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరాలని పాల్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ఇక పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.