కేఏపాల్ ఫై టిఆర్ఎస్ కార్య కర్త దాడి

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసాడు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏపాల్వెళ్తున్న సమయంలో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల సమీపంలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని పాల్ తో మాట్లాడుతుండగా..అక్కడ ఉన్న ఓ టిఆర్ఎస్ కార్యకర్త పాల్ చెంప ఫై చేయిచేసుకున్నాడు. పోలీసుల ఎదుటే ఆయనపై దాడి జరగడం తో కేఏ పాల్ పోలీసులపై ఫైర్ అయ్యారు. మీరు ప్రభుత్వోద్యోగులా లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అని నిలదీశారు. కేటీఆర్ జీతాలు ఇస్తున్నాడా.. ప్రజల సొమ్ము నుంచి జీతాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు.

తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ అన్నారు. తనపై దాడి చేయించింది కేసీఆర్, కేటీఆర్ అన్నారు. వాళ్లు ఎన్ కౌంటర్ చేయిద్దాం అని, చంపేయాలని ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. గత 8 ఏళ్లుగా అన్ని క్రైస్తవ మీటింగ్ లకు అనుమతిచ్చారు కానీ నాకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.