ఏపి ఎన్నికల ప్రధాన అధికారిగా విజయానంద్‌

k vijayanand
k vijayanand

అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఉన్న ఎన్నికల అధికారి గోపాలకృష్ట ద్వివేది బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసిఐ స్పష్టం చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపి జెన్‌కో సిఎండిగా ఉన్నారు. ఏపి క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/