రాజ్యసభకు నామినేషన్‌ వేసిన సింధియా

Jyotiraditya Scindia files nomination for Rajya Sabha
Jyotiraditya Scindia files nomination

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ వేశారు. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్‌లో బిజెపి కార్యాలయం నుంచి జ్యోతిరాదిత్య రాష్ట్ర అసెంబ్లీ సచివాలయానికి చేరుకుని, విధాన సభ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రిటర్నింగ్ అధికారి ఎపి సింగ్‌కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విడి శర్మ, రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయబోతున్న ప్రభాత్ ఝా. పార్టీలో ఇతర సీనియర్ నాయకులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి కార్యాలయానికి రావడానికి ముందు సింధియా పార్టీ నాయకులతో కలిసి మాజీమంత్రి నరోత్తం మిశ్రా నివాసంలో భోజనం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/