జ్యోతీ లాబ్స్‌, బాల్‌ ఫార్మా జోరు

Jyothy Laboratories
Jyothy Laboratories

ముంబై, : విభిన్న కేటగిరిల్లో ప్రొడక్టులు కలిగిన ఎఫ్‌ఎంసిజి కంపెనీ జ్యోతిలాబ్స్‌ షేరుకి ఔట్‌ఫెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ మెక్వారీ పేర్కొంది. కొత్త ప్రొడక్టుల విడుదల, పెట్టుబడులు కంపెనీ పనితీరును మెరుగుపరచనున్నట్లు అభిప్రాయపడింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 5.2శాతం పెరిగి రూ.192వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా బాల్‌ఫార్మా కూడా ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని ఉత్పత్తి ప్లాంట్‌కు యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణ సంస్థల నుంచి ఉత్తమ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు లభించినట్లు బాల్‌ ఫార్మా తాజాగా తెలియచేసింది. దీంతో ఈ యూనిట్‌లో రూపొందించే ఫినిష్డ్‌ డోసేజీ ఫార్ములేషన్లు యూరోప్‌, అమెరికా తదితర రెగ్యులేటెడ్‌ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు అనుకూలంగా లేనట్లు తెలియచేసింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 7.5శాతం పెరిగి రూ.74వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.77వరకూ పెరిగింది. కంపెనీలో ప్రమోటర్లకు 42.45శాతం వాటా ఉంది.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చెయండి : https://www.vaartha.com/news/business/