పోలీసులకు జ్వాల గుత్తా సూటి ప్రశ్న

Jwala Gutta
Jwala Gutta

హైదరాబాద్‌: దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్నా వారిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయండంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో స్పందించారు. తెలంగాణ పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా అత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికే సరైన శిక్ష ఇదే అని అన్నారు. ఇక నైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా అని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా ఇదే నా ముఖ్యమైన ప్రశ్న అంటూ గుత్తా జ్వాల ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/