ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ పీకే మిశ్రా

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామిని ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేయాలని సూచించింది.

ఆంధ్ర, తెలంగాణ సహా ఎనిమిది హైకోర్టులకు చీఫ్‌ జస్టి్‌సలను నియమించడంతో పాటు ఐదు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను, వివిధ హైకోర్టుల్లోని 28 మంది న్యాయమూర్తులను బదిలీచేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం తాజాగా సిఫారసు చేసింది.

ఇక అలహాబాద్ హైకోర్టు సీజేగా జస్టిస్ రాజేశ్ బిందల్, కోల్ కతా హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ రుతురాజ్ అవస్థి, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ రంజిత్ వి.మోరే, గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ అరవింద్ కుమార్, మధ్య ప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్.వి.మలిమత్ పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ గఢ్​కు, మధ్యప్రదేశ్ సీజే జస్టిస్ మహ్మద్ రఫిక్ ను హిమాచల్​కు, త్రిపుర సీజే జస్టిస్ అఖిల్ ఖురేషీని రాజస్థాన్​కు, రాజస్థాన్ సీజే జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపురకు, మేఘాలయ సీజే జస్టిస్ బిశ్వనాథ్ సోమదర్ ను సిక్కింకు సిఫార్సు చేసింది. వాటికి కేంద్రం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపనున్నట్టు సమాచారం.