ఏపి ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజు

నేడు భాధ్యతల స్వీకరణ

ap logo
ap logo

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమీషనర్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. దీంతో ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన భాధ్యతలు చేపట్టారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నియామకానికి సంబందించి సెక్షన్‌ 200 ని పూర్తిగా మర్చేస్తు ఆర్డీనెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు కుదించబడింది. ప్రస్తుత ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ యొక్క పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్‌ కనగరాజు పేరును ప్రతిపాదిస్తు గవర్నర్‌ ఆమోదానికి దస్త్రం పంపింది దీంతో గవర్నర్‌ ఆమోదముద్రవేయడంతో జస్టిస్‌ కనగరాజు నేడు భాధ్యతలు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/