మహిళల రక్షణ కోసం మెట్రో కీలక నిర్ణయం

ప్రెప్పర్‌ స్ప్రేల అనుమతి

bengaluru metro rail
bengaluru metro rail

బెంగళూరు: షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనల నేపథ్యంలో మహిళల రక్షణకు కొత్త చట్టాలను చేయాలని, అలాగే తమను తాము రక్షించుకునేందుకు ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి శిక్షణ ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు మెట్రో కార్పోరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్‌ స్ప్రేలను కూడా స్టేషన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులు ఆరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్‌ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్‌ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్‌ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే తీసుకెళ్లోచ్చని ఆదేశాలు జారీ చేసింది. మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/