17 గంటల్లో 17 లక్షల లైకులు

virat kohli
virat kohli with pet dog

న్యూఢిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న రేపటి ఐదు వన్డే కోసం ఇరు జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా కోహ్లి సోమవారం తన ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఢిల్లీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పేర్కోన్నాడు. తన పెట్‌తో దిగిన ఈ సెల్ఫీలో విరాట్‌ హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఈ ఫోటోను కోహ్లి అభిమానులు విపరీతంగా లైక్‌లు కొడుతున్నారు. ఫోటో పోస్టు చేసిన 17 గంటల్లో 17 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంటే కోహ్లికి వీరాభిమానులు ఎందరున్నారో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
మొహాలీ వన్డేలో ఆసీస్‌ గెలవడంతో సిరీస్‌2-2తో సమమైంది. దీంతో బుధవారం ఢిల్లీలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుపొంది ఎలాగైనా సిరీస్‌ నెగ్గాలని ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మే 30 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ ముందు భారత్‌కు ఇదే చివరి మ్యాచ్‌ కావడం విశేషం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/