నేటి నుంచి విధుల్లోకి జూనియ‌ర్ డాక్ట‌ర్లు‌

Junior doctors
Junior doctors

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెను విరమించారు. నిన్న సమ్మె విరమించడంతో ఇవాళ్టి నుంచి జూనియర్‌ డాక్టర్లు విధులకు హాజరుకానున్నారు. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు సఫలమవడంతో జూడాలు సమ్మెను విరమించారు.


తాజా నాడీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health