అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు 31కి వాయిదా

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, అవినాష్ తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం వరకు అరెస్ట్ చేయకుండా అదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోరగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.