ప్రారంభమైన జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌

Metro
Metro

హైదరాబాద్‌: ఈరోజు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. అమీర్ పేట్హైటెక్ సిటీ మార్గంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక కారణాల వల్ల జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్హైటెక్ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/