ఆర్ఆర్ఆర్ లో పాట పాడిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు ఆయనలో సింగర్ కూడా ఉన్నారు. గతంలో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఓ పాట పాడి ఆకట్టుకోగా..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లోను ఓ పాట పాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ ను దానయ్య రూపొందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ , కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా..అజయ్ దేవగన్ , అలియా భట్ మొదలగు వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు చిత్ర ప్రమోషన్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక పాటను పాడారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా కు మరింత బజ్ రావడం ఖాయం.