ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ రిక్వెస్ట్

జూ. ఎన్టీఆర్ తన అభిమానులకు రిక్వెస్ట్ చేసారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీ ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్ లో అట్టసంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు.

ఈ సందర్భాంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..సినిమా విశేషాలు , డైరెక్టర్ రాజేంద్ర గురించి తన సోదరుడు కళ్యాణ్ రామ్ గురించి అనేక విషయాలు తెలిపి..చివరలో అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమీ ఉండదని పేర్కొన్నారు. అయితే ప్రతి రోజు, ప్రతి పూట అప్‌డేట్ ఇవ్వలేమని తెలిపాడు. అభిమానుల ఆరాటం, ఉత్సాహం తమకు అర్థమవుతుంది కానీ దాని వల్ల ప్రొడ్యూసర్స్, దర్శకులు ఒత్తిడికి గురువుతున్నారని చెప్పుకొచ్చారు. అభిమానులను అప్‌డేట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టెన్షన్‌కు గురువుతన్నారని అన్నారు. నిజంగా ఏదైనా అప్‌డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కంటే ముందు మీకే చెప్తామని సూటిగా చెప్పేశారు. అప్‌డేట్ ఉంటే ఖచ్చితంగా చెప్తామని.. అది కూడా అదిరిపోయే అప్‌డేట్ ఉంటేనే చెప్తామని ఖరాకండిగా చెప్పారు.