ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై ఎన్టీఆర్ స్పందన

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని చురకాల అంటించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదన్నారు ఎన్టీఆర్. యూనివర్సిటీ కి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం ఫై టీడీపీ నేతలు , అభిమానులు , నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం పేరు మార్చడం ఫై గవర్నర్‌కు ఫిర్యాదు చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని, హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.