ఏపీ నెక్ట్స్ సీఎం ఆయనే!

ఏపీ నెక్ట్స్ సీఎం ఆయనే!

ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, ప్రచారాలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కాగా వచ్చే ఎన్నికల కోసం అప్పుడే రాజకీయ నాయకులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ఓ ఫ్లెక్సీ తెగ హల్‌చల్ చేస్తోంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈయనే అంటూ ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి నెక్ట్స్ సీఎం అని ప్రింట్ చేశారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండెపాలెంలో ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ ఓ ఫ్లెక్సీ కనిపించడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్, ఆ తరువాత రాజకీయంగా ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లలేదు. అయితే ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా సీఎం అవుతారని ఆయన అభిమానులు ఈ పోస్టర్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఏదేమైనా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జూనియ్ ఎన్టీఆర్ పోస్టర్ పెద్ద చర్చకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ మరోసారి ప్రచారంలో పాల్గొంటారా, లేక పార్టీ అభ్యర్థిగా రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తాడా అనేది తెలియాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.