చిదంబరం వ్యాఖ్యలను ఖండించిన నడ్డా

చిదంబరం వ్యాఖ్యలను ఖండించిన నడ్డా
JP Nadda

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ఆర్టిక‌ల్ 370ని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. బీహార్ ఎన్నిక‌ల‌కు మందు కాంగ్రెస్ పార్టీ డ‌ర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోందంటూ ఆయన అన్నారు. జ‌మ్మూ కశ్మీర్‌లో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎజెండా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమర్శించారు.

కాగా గతేడాది అగష్టు 5వ తేదీన ప్రధాని మోడి జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయాలను తిప్పికోట్టాలంటూ చిదంబరం చేసిన ప్రకటనపై నడ్డా స్పందించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/