జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే కరోనా సమయంలొ వార్తలు సేకరించేందుకు వెళ్తున్న పాత్రికేయులు కూడా కరోనా భారిన పడుతున్నారని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. వార్తల సేకరణకు వెళ్లి ఏపిలో కూడా కొందరు జర్నలిస్టులు కరోనా భారిన పడ్డారని వారిని ఆదుకోవాలని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే హర్యాన ప్రభుత్వం జర్నలిస్టులకు రూ.10 లక్షల భీమా సౌకర్యం కల్పించగా.. అదే మాదిరి ఏపిలోను మిడియా మిత్రులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/