కాంగ్రెస్‌లో చేరడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్లే!

బిజెపి మంత్రి సిటి రవి

CT.Ravi
CT.Ravi

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీలో చేరితే బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని, ఆ విషయాన్ని కొందరు నాయకులు గుర్తుపెట్టుకోవాలని బిజెపి మంత్రి సిటి రవి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, ఆత్మహత్య చేసుకోవడం రెండూ ఒకటే, అందులో ఎలాంటి తేడా లేదని కర్ణాటక మంత్రి, బిజెపి సీనియర్‌ నేత సిటి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైసూరులో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న పడవ అని ఎద్దేవా చేశారు. భారత్‌లో రెండు రాష్ట్రాల్లో తప్ప మరే రాష్రాల్లోను కాంగ్రెస్‌ ప్రభావం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు విలువ, భవిష్యత్తు లేదని మంత్రి సిటి రవి ఆందోళనకరంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నవారు సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటున్నామని ఇప్పటికైనా గ్రహించాలని రవి సూచించారు. ఆ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని తెలుసుకోవాలన్నారు. అనర్హత ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎలాంటి పరిస్థితుల్లోను బిజెపిలో చేర్చుకోమన్నారు. వారికి ఆ అవకాశమే లేదని రవి స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బిజెపి టిక్కెట్లు ఇచ్చే విషయం బిజెపి కోర్‌ కమిటి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/