జాన్సన్​ అండ్​ జాన్సన్​ అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు

టీకాను తీసుకొచ్చేందుకు ఏప్రిల్ నుంచే కసరత్తులు

హైదరాబాద్ : భారత్ కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. తన ఏకైక డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ ఈరోజు వెల్లడించింది. ఆగస్టు 5న వ్యాక్సిన్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ భారత ప్రతినిధి వెల్లడించారు.

కాగా, భారత్ లో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని గత సోమవారం సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని పేర్కొంది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించీ అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/