కోహ్లీ సేనకు మాజీ కోచ్ చురక

john wright indian coach, kohli
john wright Indian coach, kohli

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి రికార్డులకెక్కింది. చారిత్రక విజయం సాధించిన కోహ్లీ సేన రెండో టెస్టుకు సమాయత్తం అవుతోంది. ఆసీస్ గడ్డపై సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకోవాలని కోహ్లీ గట్టి పట్టుదలగా ఉన్నాడు. దీనికి ఈ విజయం మరింత ఉత్సాహాన్ని నింపింది. టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ భారత్ జట్టు విజయంపై స్పందిచాడు.  ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాలని సూచించాడు. ఈ విజయంతో గాల్లో తేలిపోవడం ఆపి భూమికి పైకి దిగాలని చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాపై భారత్ చివరి సారిగా 2003లో టెస్టుల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై తొలి టెస్టును గెలుచుకున్న దాఖలాలు లేవు.  కోహ్లీ తొలి మ్యాచ్‌లో గెలిచి రికార్డులకెక్కింది.