రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు..స్పందించిన మంత్రి జోగి రమేశ్

అటువంటి పరిస్థితేమీ లేదన్న మంత్రి రమేశ్

jogi ramesh
jogi ramesh

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటుండడం తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులేమీ లేవని అన్నారు. ఎన్నికల ప్రకారమే వస్తాయని వెల్లడించారు. టిడిపి అంతిమదశలో ఉంది కాబట్టే ముందస్తు అంటూ చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడని జోగి రమేశ్ మండిపడ్డారు. టిడిపి ఇప్పటికే వెంటిలేటర్ పై ఉందని, ఇక బతికే అవకాశమే లేదని, వల్లకాడుకు పోవడమే మిగిలుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చంద్రబాబు, లోకేశ్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల కూడా భాగస్వామి అని ఆరోపించారు. చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/