జోరూట్‌ అరుదైన రికార్డు

1996 ప్రపంచకప్‌ తర్వాత ఇదే తొలిసారి

joe root
joe root

సౌతాంప్టన్‌: సౌతాంప్టన్‌ వేదికగా శుక్రవారం వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శతక వీరుడు జోరూట్‌ ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే వన్డేలో శతకం చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రెండు క్యాచ్‌లు పట్టాడు. 1996 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రూట్‌ నిలిచాడు.
లాహోర్‌ వేదికగా 1996 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంక ఆటగాడు అరవింద డిసిల్వ శతకం బాదడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి రెండు క్యాచ్‌లు పట్టాడు. అతడి తర్వాత ఈ రికార్డు సృష్టించింది రూట్‌ ఒక్కడే. ఈ శతకం సాధించడంతో పాటు మ్యాచ్‌ గెలవడం చాలా సంతోషంగా ఉంది, ఇది సమిష్టి విజయం అని రూట్‌ పేర్కొన్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/