100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌

Joe Biden
Joe Biden

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రోనా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తెలిపారు. ప్రధానంగా మూడు లక్ష్యాలను సాధించడంపై దృష్టిసారించినట్లు చెప్పారు. అందరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించేలా చూడటం, 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయడం, పిల్లలు మళ్లీ బడిబాట పట్టడానికి పాఠశాలలను తెరవడం తన లక్ష్యాలని వెల్లడించారు. వీటి సాధన కోసం తాను ఎంపిక చేసిన వైద్య బృందం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/