19 నుంచి వయోజనులందరికీ వ్యాక్సినేష‌న్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి

joe Biden-Vaccination for all adults from 19
joe Biden-Vaccination for all adults from 19

Washington: అమెరికాలో క‌రోనా తీవ్రతరంపై అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వెలిబుచ్చారు. దేశం ఇప్పటికీ చావు బతుకుల మధ్య ఉందని, క‌రోనా నిబంధ‌నలను దేశ ప్రజలు కచ్చితంగా పాటించాల‌ని కోరారు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయ‌ని ,ఆసుప‌త్రుల్లో చేరే బాధితుల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. .ఈ ఏడాది జులై 4వ తేదీలోపు క‌రోనా తీవ్ర‌త త‌గ్గి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆలోగా ఎంతమందిని కాపాడుకుంటామనేదే ముఖ్య‌మ‌ని చెప్పారు ఈ నెల‌‌ 19 నుంచి దేశంలో వయోజనులందరికీ వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/