అధికారంలోకి వస్తే హెచ్‌1బీ వీసాలపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తా

ఈ వీసాదారులు అమెరికాకు గొప్ప సేవలు చేశారన్న బిడెన్‌

Joe Biden
Joe Biden

అమెరికా: నవంబరులో జగరనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్‌ పోటి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్న జో బిడెన్ మాట్లాడుతూ..తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే హెచ్‌1బీ వీసాలపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని జో బిడెన్ ప్రకటించారు.
ఆయన (డొనాల్డ్ ట్రంప్) హెచ్‌1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు రద్దు చేశారు. అయితే, నా పాలనలో మాత్రం వాటిపై నిషేధం ఉండదు’ అని చెప్పారు. ‘ఈ దేశ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరేజే ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లును యూఎస్ ప్రతినిధుల సభకు పంపుతాను. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్‌ ఆఫ్స్‌ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ)కు చెందిన 1.7 మిలియన్ల మంది సహా 11 మిలియన్ల మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు రోడ్‌ మ్యాప్‌ కోసం కృషి చేస్తాను’ అని జో బిడెన్ తెలిపారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/