టబు, సోనాలి, సైఫ్‌లకు హైకోర్టు నోటీసులు

Saif Ali Khan, Tabu, Neelam and Sonali Bendre
Saif Ali Khan, Tabu, Neelam and Sonali Bendre


జోధ్‌పూర్‌: సినీ నటులు టుబు, సోనాలి బింద్రే, సైఫ్‌ అలీఖాన్‌, దుష్యంత్‌ సింగ్‌, నీలమ్‌ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణజింకలను వేటాడారని కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన తీర్పును గతేడాది జోధ్‌పూర్‌ న్యాయస్థానం వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా ఈ కేసులో సల్మాన్‌తో పాటు వారిది కూడా సమాన తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం వారికి సమన్లు జారీ చేసింది.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/