జార్ఖండ్‌లో కాంగ్రెస్‌, జెఎంఎంకే పగ్గాలు

హేమంత్‌సోరేన్‌కు ముఖ్యమంత్రి పీఠం

Hemant Soren
Hemant Soren

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘోర పరాజయం పాలయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార బిజెపిని చిత్తుచేస్తూ జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం) కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఓటమిని అంగీకరిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబరదాస్ పదవికి రాజీనామా చేశారు. ఓటమికి తనదే బాధ్యత అని ప్రకటించారు. స్థానిక అంశాలే ఈ ఎన్నికలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు 81. ఇందులో ప్రభుత్వ స్థాపనకు అవసరమైన స్థానాలు 41. మూడు పార్టీల కూటమి 47 స్థానాలలో విజయం సాధించింది. దీనితో ప్రభుత్వ స్థాపనకు రంగం సిద్ధం అయింది.

ఇక అధికార బిజెపి కేవలం 25 స్థానాలలో గెలుపొందింది. జెవిఎం 3, ఎజెఎన్‌యూ 2, ఇతరులు 4 స్థానాలకు పరిమితం అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి చెందారు. ఇక జెఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షులు, సిఎం అభ్యర్థి హేమంత్ సొరెన్ పోటీచేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. రాష్ట్రంలో సొరెన్ వారసత్వానికి తిరుగులేదని నిరూపించారు. రాష్ట్రంలో అధికార బిజెపి పట్ల ఉన్న వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కన్పించింది. దాస్ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా పరాజయం పాలయ్యారు. జార్ఖండ్‌లో బిజెపి ఈసారి ఒంటరిపోరుకు దిగింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగుతున్న బిజెపి ఈసారి సీట్లసర్దుబాటులో గొడవలతో సొంతంగా పోటీకి దిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/

యండి: