జెఎం ఫైనాన్స్‌, ప్రిజయ్ జాన్సన్‌ ర్యాలీ

న్యూఢిల్లీ : టర్నోవర్‌లో 80 శాతం వరకూ సమకూరుస్తున్న నాలుగు హోటళ్లను విక్రయించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని హోటల్‌ లీలా కుదుర్చుకుంది. డీల్‌ విలువ రూ.3950కోట్లు కాగా, దీంతో హోటల్‌ లీలాలో 26 శాతం వాటాను కలిగి ఉన్న జెఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లబ్ధి పొందనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సంస్థ జెఎం ఫైనాన్షియల్‌కు అనుబంధ విభాగం కావడంతో ఈ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ సంస్థ 8.5శాతం పెరిగి రూ.94వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.99వరకూ పెరిగింది. అదేవిధంగా ప్రిజం జాన్సన్‌ కూడా సిఎస్‌ఇ సోలార్‌ పార్క్స్‌ సాత్నాలో 27 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రిజం జాన్సన్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. సొంత అవసరాలకు వినియోగించుకోగల విద్యుత్‌ యూనిట్‌ ఏర్పాటు వ్యయాలను తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగానే సిఎస్‌ఇ సోలార్‌లో వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రిజం జాన్సన్‌ తెలియచేసింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3 శాతం పెరిగి రూ.92వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 74.87శాతం వాటా ఉంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :