హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేయండి
జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆహ్వానం

రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటకు జెఎంఎం-ఆర్జెడి-కాంగ్రెస్ కూటమి రంగం సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జెఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించేందుకు సోరెన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా సోనియాను కోరారు. కాగా డిసెంబర్ 29న సోరెన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/