జార్ఖండ్లో 18 నుండి ఇంటింటి సర్వే
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారీగా ఇంటింటి సర్వే

రాంచీ: కరోనా వైరస్ కేసులు జార్ఖండ్లో భారీగా పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి వచ్చిన నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి భారీగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. శ్వాస సంబంధ సమస్యలు, బీపీ, క్షయ, క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతున్న వారి నుంచి కూడా నమూనాలు సేకరించి ప్రాథాన్యత క్రమంలో పరీక్షలు జరుపుతామని ఆ రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి నితిన్ కులకర్ణి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఐసీఎంఆర్ సర్వే జరుపుతున్నదని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని కోరినట్లు ఆయన చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/